తాగునీరు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం

61

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాగు నీరు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు శాసనమండలిలో  మంత్రి కేటీఆర్ తెలిపారు. నీటి సమస్యలు తీర్చే అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ… గ్రేటర్ శివారు మున్సిపాలిటీలకు నీటి సరఫరా కోసం రూ.1900 కోట్లు కేటాయించామని తెలిపారు. నీటి సమస్య అధికంగా ఉన్న 190 గ్రామాల సమస్య తీర్చడానికి..జీవో 262 ద్వారా రూ.1136 కోట్ల నిధులను మంజూరు చేశామన్నారు.హైదరాబాద్‌తోపాటు ఔటర్‌రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాలకు నీటి పంపిణీ బాధ్యతను హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు అప్పగించామన్నారు