ఫిబ్రవరి 23 లోగా జయ మృతిపై నివేదిక ఇవ్వండి

77

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు విచారించింది. వచ్చే నెల 23 లోపు జయకు అందించిన చికిత్సపై నివేదికను సీల్డ్ కవరులో ఇవ్వాలని  తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే అపోలో ఆస్పత్రి తరపు న్యాయవాది అమ్మకు అందించిన చికిత్సపై నివేదిక ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.