చేపల మార్కెటింగ్ కు చర్యలు తీసుకుంటున్నాం

54

తెలంగాణలో భారీగా చేపల పెంపకాన్ని చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.. చేప పిల్లలను కూడా మన వద్దే ఉత్పత్తి చేయాలని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనువైన ప్రాంతాల్లో చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ చేప పిల్లల పెంపకాన్ని చేపడుతున్నామని వివరించారు. చేపల మార్కెటింగ్‌కు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఫిషరీస్ సొసైటీలు ఏర్పాటు చేసి మత్స్య కుటుంబాలకు సభ్యత్వాలు కల్పిస్తామన్నారు. ప్రతీ కుటుంబానికి సభ్యత్వం ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెండు ఫిషరీష్ కాలేజీలు, ఒక ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.