రైలు టికెట్ ధ‌ర‌కే విమాన యానం

125

ప్ర‌త్య‌ర్థి విమానయాన సంస్థ‌ల పోటీని త‌ట్టుకోవ‌డానికి ఎయిరిండియా విమాన టికెట్ల రేట్ల‌ను భారీగా త‌గ్గించింది. రైలు టికెట్ ధ‌ర‌కే విమాన టికెట్ రేట్ల‌ను స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీ-జమ్ము మార్గంలో 1,610 రూపాయ‌ల‌కే టికెట్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. అదేవిధంగా ఢిల్లీ-ముంబై మార్గంలో  2,401, ఢిల్లీ-బెంగళూరు మార్గంలో 2,952, ఢిల్లీ-చెన్నై మార్గంలో 3,100 రూపాయ‌ల‌కు టికెట్ల ధరలను త‌గ్గించింది. అయితే ఈ పథకం కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో మాత్రం ఎయిరిండియా వెల్లడించలేదు. పరిమితంగానే సీట్లున్నాయని, అందువల్ల ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన వాటిని కేటాయిస్తామని మాత్రం తెలిపింది.