గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన చిరు అభిమానులు

77

గుంటూరు జిల్లాలో చిరు అభిమానులు రెచ్చిపోయారు.  కొల్లూరు లోని శ్రీనివాసా ధియేటర్ లో ఖైదీ నెం150  బెనిఫిట్ షో వేస్తామని చెప్పి, టికెట్లు విక్రయించి, చిత్రాన్ని ప్రదర్శించ లేదని ఆరోపిస్తూ, అభిమానులు థియేటరుపై రాళ్లదాడి చేశారు. షో వేయకపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోగా, హాల్లోకి ప్రవేశించి, తెరను చించి, కుర్చీలు ధ్వంసం చేసి రచ్చ రచ్చ చేశారు. అభిమానుల ప్రవర్తన చూసి అవాక్కైన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చినా, వారు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోలీసులు అభిమానుల అల్లరికి అడ్డుకట్ట వేసినప్పటికీ, లక్షల నష్టం వాటిల్లిందని థియేటర్ యాజమాన్యం వాపోయింది.