బామర్ధికో న్యాయం.. నాకోన్యాయమా?

259

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పై టాలీవుడ్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ మండిప‌డ్డారు. బాల‌య్య న‌టించిన వందో చిత్రం ‘గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణికి’ తెలంగాణ ప్ర‌భుత్వంతోపాటు ఏపీ స‌ర్కారు వినోద‌పు ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. ఇది ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఏపి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఆస‌రాగా చేసుకుని చంద్ర‌బాబుపై గుణ‌శేఖ‌ర్ విమ‌ర్శ‌నలు ఎక్కుపెట్టారు. 2015లో గుణ‌శేఖ‌ర్ కాక‌తీయుల వీర‌నారి రుద్ర‌మ‌దేవి జీవిత‌గాధ ఆధారంగా ‘రుద్ర‌మ‌దేవి’ చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం వినోద‌పు ప‌న్నుని మిన‌హాయించింది. కానీ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం ఇంకా ప‌రిశీల‌న‌లోనే ఉంచింది.

ఇప్పుడు ‘గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి’ నిర్మాత‌లు అడ‌గ్గానే ఈ చిత్రానికి ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌క‌టిస్తూ ఏపీ స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఇదే స‌రైన‌స‌మ‌య‌మ‌ని భావించిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి బ‌హిరంగ లేఖ రాశారు. ‘రుద్ర‌మ‌దేవి’ చిత్రం పై వినోద‌పు రాయితీ విష‌యాన్ని మ‌రోసారి ప‌రిశీలించాల‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఆ లేఖ కాపీని సోష‌ల్ మీడియాలోనూ ఉంచారు. దీంతో ఇప్పుడీ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రీ.. గుణ‌శేఖ‌ర్ విన‌తిపై చంద్ర‌బాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.