పత్తికి రికార్డు ధర

105

ఈ సీజన్ లో పత్తికి తొలిసారి రికార్డు స్థాయి ధర పలికింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి క్వింటాల్ ధర 5,500 రూపాయలు పలికింది. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. . అక్టోబర్‌లో సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే రికార్డు ధర. కాగా, కనిష్ఠ ధర 5,300 రూపాయలుగా ఉంది.