సంక్రాంతికి సెలవులు ఐదు రోజులు

295

సంక్రాంతికి ముందుగా ప్రకటించినట్టు నాలుగు రోజులు కాకుండా ఐదు రోజుల సెలవు దినాలు ఇస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముందు ప్రకటించినట్టు కాకుండా ఈనెల 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ సెలవుల ప్రకారం ఈ నెల 15న పండుగ నిర్వహిస్తున్నారు. దీంతో విద్యాశాఖ ఈ మార్పుచేసింది.