హోటల్ కార్మికుడు  హత్య

56

హోటల్లో పనిచేసే కార్మికుల మధ్య తలెత్తిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఫలక్ నుమా పీఎస్ పరిధిలోని జైతున్ హోటల్లో ఘటన చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో జుబేర్ అనే కార్మికుడు హత్యకు గురయ్యాడు. అయితే ఘర్షణ ఎందుకు జరిగిందో కారణాలు తెలియరాలేదు. హత్య జరిగిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.