హైదరాబాద్ లో భారత్-బంగ్లా ల మధ్య టెస్ట్ మ్యాచ్

85

వచ్చే నెల 13 నుంచి ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుందని వార్త‌ల‌ను హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌ కార్య‌ద‌ర్శి కే.జాన్ మ‌నోజ్  తెలిపారు. బంగ్లాదేశ్‌, టీమిండియా టెస్టు మ్యాచుకు హైద‌రాబాద్‌, ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ వేదిక కావ‌డం లేదంటూ వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆయన కొట్టిపారేశారు. ఆ స్టేడియంలోనే మ్యాచు జ‌రుగుతుంద‌ని, ప్ర‌క‌ట‌న‌ల‌ కోసం టెండ‌ర్లు కూడా ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు. ఈ మ్యాచ్ కోసం తాము ట్వంటీ ఫ‌స్ట్ సెంచ‌రీ మీడియాతో ఒప్పందం సైతం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆ టెస్టు మ్యాచుకు ముందే బంగ్లాదేశ్ జ‌ట్టు న‌గ‌రానికి వ‌చ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు, వార్మ‌ప్ మ్యాచ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.