ఇందిరా పార్క్ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం

60

ఇందిరాపార్క్‌లో గల డంపింగ్‌ యార్డ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పార్క్‌ వెనుక భాగంలోని మున్సిపల్‌ డంపింగ్‌ యార్డ్‌ పక్కనే పార్క్‌లోని చెత్తను కుప్పగా చేర్చారు. ఎండలకు పార్కులోని చెత్తతో పాటు డంపింగ్‌ యార్డ్‌లోని చెత్త చెదారమంతా ఎండిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్‌ పీకలు చెత్తలో పడేయటంతో మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.