ఇంటర్ విద్యను మోడల్ విద్యగా మారుస్తాం

46

రాష్ట్రంలో తొలిసారిగా ఉచితంగా ఇంటర్ విద్యను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ విద్యను మోడల్ విద్యగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. 2004-2014 మధ్య 79 జూనియర్ కళాశాలలు మంజూరు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 56 కళాశాలలకు సొంత భవనాలు, స్థలాలు కేటాయిస్తున్నామని తెలిపారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలకు నిధులను మంజూరుచేస్తున్నట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని…  ఈ నెల 12లోపు సమ్మెలో ఉన్నవాళ్లు వెంటనే విధుల్లో చేరాలని ఆయన సూచించారు.