ముగ్గురు  అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

44

 


వనస్థలిపురంలో  పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు  అంతర్ జిల్లా  దొంగల ముఠా సభ్యులని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుల నుంచి లక్షల  విలువైన రెండు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. ఓ చోరీ కేసు విషయంలో నిందితులపై కొన్ని నెలల క్రితమే డిండి పీఎస్‌లో కేసు నమోదైంది. ముఠా సభ్యులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.