సింగరేణిలో అంతులేని అవినీతి

62

సింగరేణి బొగ్గు గనుల్లో తారాస్థాయిలో అవినీతి జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సింగరేణి అంశంపై శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయనీ, వాటిపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. సింగరేణిలో ఏటా 100 కోట్ల రూపాయల సామగ్రి అక్రమంగా రవాణా అవుతోందన్నారు. సింగరేణిలో పనిచేసే కార్మికులు అనారోగ్యం బారినపడుతున్నందున వారిని ఆదుకొనే దిశగా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. బొగ్గు కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో నెలకొన్న అవినీతి, కుంభకోణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని సింగరేణిని బాధ్యతతో నిర్వహించాలని కోరారు.