జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయండి..

61

ప్రధాని నరేంద్ర మోడీని ఏఐఏడీఎంకే ఎంపీలు భేటీ కానున్నారు. తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించుకునే జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని ఎంపీలు కోరనున్నారు. ఎద్దుల్ని హింసించే జల్లికట్టుపై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు నిషేధం విధించింది.  జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని తమిళ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతి పండుగకు తమిళ ప్రజలు జల్లికట్టును నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి జల్లికట్టును నిర్వహించడం లేదు.