కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

57

రాష్ట్రవ్యాప్తంగా 53 కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. కుమ్రం భీం జిల్లాలోని జైనూరులో మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి కదుల గోదాంలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.150 కోట్లతో రైతుల కోసం గోదాంలను నిర్మిస్తున్నామని తెలిపారు.