కర్మన్ ఘాట్ లో భారీ పేలుడు

65

కర్మన్ ఘాట్ లో ఓ ఇంటిలో భారీ పేలుడు సంభవించింది. సాయినగర్ కాలనీలో. ఫ్రిడ్జ్ కంప్రెసర్ విద్యుదాఘాతానికి గురై పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. పేలుడు ధాటికి ఇంటి గోడకు పగుళ్లు వచ్చాయి. ఇంట్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసమైంది. పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.