అశోక్ గజపతిరాజుతో కేటీఆర్ భేటీ

68

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. విమానయాన రంగాన్ని అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్నామని చెప్పారు. బేగంపేట ఎయిర్ పోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ అభివృద్ధికి కేంద్రాన్ని సాయం చేయమని కోరామని మంత్రి చెప్పారు. గతంలోనే కొత్తగూడెం ఎయిర్ పోర్టుకు కేంద్రం టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీజినల్ కనెక్టివిటీ స్కీంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు.