మహారాష్ట్రలో పట్టాలు తప్పిన గూడ్స్

65

ఆసి ఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని వీర్గాం–మాణిక్‌గఢ్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బొగ్గు లోడ్‌తో కాగజ్‌నగర్‌ నుండి బల్లార్షా రూట్‌లో వెళ్తున్న  రైలు 16 బోగీలు పట్టాలు తప్పడంతో న్యూ ఢిల్లీ–చెన్నై ప్రధాన రైల్వేలైన్‌లో ఉన్న కాగజ్‌నగర్‌–బల్లర్షా రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు బోగీలను తొలగించేందుకు సహా యక చర్యలను ముమ్మరం చేశారు. దీంతో పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్ని రైళ్ల రూటును మార్చారు.