దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు

74

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువకుల ఆశలు అడియాశలయ్యాయని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే  మల్లు భట్టి వవిక్రమార్క అన్నారు. స్కాలర్ షిప్పులను ఇవ్వకుండా  విద్యార్థులను  ఇబ్బంది పెడుతున్నారు.  భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు  ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లకు చెందిన నిధులను వాడుతూ  దళిత, గిరిజనుల్లో నోళ్లలో మన్నుకొట్టారని విమర్శించారు. దళిత, గిరిజనులు భూములు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. చట్టాలను అమలు చేయాలనే ప్రేమలేదని విమర్శించారు. అంబేద్కర్ పేరుతో ఉన్న ప్రాజెక్టును మార్చేసి దళిత ఆత్మాభిమానాన్నిదెబ్బతీశారని మల్లు భట్టివిక్రమార్క దుయ్యబట్టారు.