ద‌ళితులు జీవితాల్లో కేసీఆర్ వెలుగులు

76

ద‌ళితుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపార‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ పేర్కొన్నారు. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో  శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. ద‌ళితుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప‌థ‌కాలు చేప‌ట్టింద‌ని ఆయ‌న అన్నారు. కల్యాణలక్ష్మీ పథకం ద్వారా దళిత ఆడబిడ్డలను ప్రభుత్వం ఆదుకుంటున్న‌ద‌ని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేసింద‌ని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ భూముల్లో బోర్లు వేయించి, విత్తనాలు కూడా సరఫరా చేసి పంటల సాగుకు తోడ్పాటును అందించిందన్నారు.