మోడీ పాలన హిట్లర్ ను తలపిస్తోంది..

59

మోడీ పరిపాలన హిట్లర్‌ను తలపిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడి జీవితం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్న నారాయణ…. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా మాత్రమే మోడీ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు.