మోడీపాలనపై శివసేన ధ్వజం

55

బీజేపీపై మిత్ర‌ప‌క్షం శివ‌సేన నిప్పులు చెరిగింది. ఎన్న‌డూ ఇంత ఘోర‌మైన పాల‌న చూడ‌లేద‌ని విమ‌ర్శించింది. మోడీ స‌ర్కారు  హీనంగా పాలించడండలో  రికార్డు సాధించిందని  వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పెద్ద‌నోట్ల ర‌ద్దు న‌ల్ల‌ధనాన్ని  స‌మూలంగా తుడిచిపెట్టేస్తుంద‌ని  భావిస్తున్న బీజేపీ నేత‌లు పిచ్చివాళ్ల స్వ‌ర్గంలో విహ‌రిస్తున్నార‌ని అన్నారు. మోడీ త‌న నిర్ణ‌యంతో మ‌హిళ‌లను అష్ట‌క‌ష్టాల  పాలు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. పాత‌నోట్ల మార్పిడికి  అనుమ‌తించ‌లేద‌ని ఓ త‌ల్లి అర్ధ‌న‌గ్నంగా మార‌డం ప్ర‌భుత్వ తీరుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పించింది.