నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం

132

 సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే  ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని వెలమలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బటర్ ఫ్లై పరిశ్రమలో పనిచేసే  రాజేశ్వరిని అదే సంస్థలో పని చేసే నరేష్ అనే ప్రేమోన్మాది గొంతుకోసి పరారయ్యాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు తెలపడంతో పోలీసులు యువతిని కల్వకుర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటనపై బాధితురాలిని స్థానిక పోలీసులు ప్రశ్నించగా, నరేశ్ అనే వ్యక్తి తమ పక్కన ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కత్తితో పొడిచాడని, తాను భయంతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చానని తెలిపింది.ప్రస్తుతం ఆమె తీవ్ర రక్తస్రావంతో ఆమె ప్రమాదం అంచుల్లో ఉంది. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు, నిందితుడికోసం గాలింపు చేపట్టారు.