నల్లగొండకు పిచ్చి ఎమ్మెల్యే తగిలాడు

104

నల్లగొండకు పిచ్చి ఎమ్మెల్యే తగిలాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.  కోమటిరెడ్డి ఒక రోజు సీఎం అవుతానంటాడు, మరొక రోజు పాదయాత్ర అంటూ పూటకో మాట మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడి కూడా అవుతానని చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. 2009, 2014 ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గంలో వెంకట్‌రెడ్డి కంటే తనకే ఎక్కువ మెజారిటీ వచ్చిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడన్నారు.