సభ నుంచి విపక్షాలు వాకౌట్

71

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎం సభ్యులు సభ నుంచివాకౌట్‌ చేశారు విద్యార్థులను మభ్యపెట్టేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని  టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో డీఈడీ, బీఈడీ, బీటెక్‌ చదువుతున్నారు.. ఇది అవసరమా అన్నట్టు సీఎం మాట్లాడుతున్నారని  విమర్శించారు. ఏపీ కాలేజీలలో సీట్లు వచ్చిన తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయడం లేదన్నారు. జనవరి వరకు. బుధవారం  మంత్రి హరీశ్‌రావు  డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్ రెడ్డికి సైగచేసి సభను వాయిదా వేయించారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.