బంకుల్లో సర్ ఛార్జి లేదు

178

పెట్రోల్ బంకుల్లో జరిగే నగదు రహిత లావాదేవీలపై  కేంద్రం స్పష్టం చేసింది. కార్డులో పెట్రోల్  బంకుల వద్ద లావాదేవీలు జరుపుతుంటే  తలెత్తిన సర్వీస్ చార్జీ సమస్యపై కార్డుతో పెట్రోలు ఇచ్చేందుకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నిరాకరించాయి. నోట్ల ర‌ద్దు వ‌ల్ల డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు పెట్రోల్ బంకులు డిజిట‌ల్ లావాదేవీల‌పై ప‌న్ను వ‌సూలు చేయ‌లేదు. అయితే నోట్ల ర‌ద్దుపై కాల‌ప‌రిమితి ముగిసిపోవ‌డంతో ఇప్పుడు పెట్రోల్ బంకులు మ‌ళ్లీ ట్యాక్స్ వ‌సూల్ చేయాల‌ని భావించాయి.  అయితే ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను అంగీకరించమని బంక్ యాజమాన్యాలు తెలిపాయి. ఈవిషయంలో ప్రభుత్వం కలుగజేసుకొని ఈనెల 13 వరకు ఎటువంటి సర్ చార్జి ఉండదని స్పష్టం  చేసిన నేపథ్యంలో నిర్ణయంపై వెనక్కు తగ్గాయి. దీనిపై సమీక్ష జరిపిన కేంద్ర ప్ర‌భుత్వం త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. డిజిట‌ల్ లావాదేవీలు నిర్వ‌హించే క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు ప‌న్ను ఉండ‌ద‌ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ తెలిపారు. రిటేల్ పెట్రోల్ కంపెనీల మీద కూడా ఎటువంటి భారం ఉండ‌ద‌న్నారు. కార్డు పేమెంట్‌పై వాస్త‌వానికి బ్యాంకులు ప‌న్ను వసూల్ చేస్తాయి. అయితే ఇంధ‌న కంపెనీలు, బ్యాంకులు ఈ స‌మ‌స్య‌పై త్వ‌ర‌లో ఓ నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని మంత్రి తెలిపారు.