ప్లాట్ ఫాం ధర టికెట్ ధర పెంపు

80

పండుగలు  వచ్చాయంటే వారం ముందు నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిట కిట లాడుతుంటాయి. అయితే ప్రయాణికులు అవసరాన్ని  ఆసరాగా చేసుకొని ఆయా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.  ఆర్టీసీ  అదనపు చార్జీలతో బస్సులు నడుపుతుంది. అయితే మూడు నెలల ముందుగానే ట్రైన్ రిజర్వేషన్లు పూర్తి కావడంతో వీరిని పంపేందుకు, అలాగే రిసీవ్ చేసుకొనేందుకు రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. వీరు ప్లాట్ ఫాం టికెట్ కొని స్టేషన్ లోకి వెళ్లవలసి ఉంటుంది. అయితే  పండుగల సీజన్ లో రైల్వేస్టేషన్లలో ప్లాట్ ఫాం టిక్కెట్టు ధరను తాత్కాలికంగా పెంచే  పనిలో రైల్వేశాఖ ఉంది.  ప్రస్తుతం సంక్రాంతి సీజన్ దృష్ట్యా ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ.  10 నుండి 20 కి పెంచారు. నగరంలోని సికింద్రాబాద్,కాచిగూడ,  హైదరాబాద్ స్టేషన్లలో ప్లాట్ ఫాం ధరను ఈ నెల 10 నుంచి 16 వ తేదీ వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు కాకుండా ఇతరులు రైల్వే స్టేషన్ లోపలికి రావోద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.