ఇప్పుడు మోడీ గాలి లేదు…

73

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో మోడీ గాలి వీచిందని… ఇప్పుడు ఎలాంటి గాలి లేదని కట్జూ చెప్పారు. కులం, మతం ఆధారంగానే 90 శాతం ఓటింగ్ నమోదవుతుందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో లబ్ధి పొందాలని మోదీ భావించారని… కానీ, అది విజయవంతం కాలేదని చెప్పారు. నోట్ల రద్దు వల్ల బీజేపీకి నష్టం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం వస్తుందని తెలిపారు. మాయావతి పార్టీ బీఎస్పీ కన్నా బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయని చెప్పారు.