రవిశాస్త్రిని విమర్శించిన అజారుద్దీన్

30

భారత క్రికెట్ లో గొప్ప కెప్టెన్లు వీరేనంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఓ జాబితాను విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత జట్టును విజయాల వైపు నడిపించిన సౌరవ్ గంగూలీ పేరును బెస్ట్ కెప్టెన్స్ లిస్ట్ లో చేర్చకపోవడంపై రవిశాస్త్రిపై అజార్ మండిపడ్డాడు. వ్యక్తుల గురించి అతను ఏమనుకుంటున్నాడో అనవసరమని… గంగూలీ ఎంత గొప్పవాడో అతని గణాంకాలే చెబుతాయని అన్నాడు. జాబితా తయారు చేసేటప్పుడు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టాలని, టీమ్ కు ఎన్నో విజయాలను అందించిన వారిని కించపరచకూడదని సూచించారు.