ఆ రిపోర్టులు నిజం కాదు

82

రద్దయిన పెద్ద నోట్లు తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్  లోకి వచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ స్పందించింది. డిసెంబర్ 30 తరువాత ఆర్ బీ ఐ కాని, ప్రభుత్వం కాని బ్యాంకింగ్ సిస్టమ్ లో డిపాజిట్ అయిన పాత నోట్లపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌ వెలువరించలేదని పేర్కొంది. బ్యాంక్ ల్లో జమ అయిన నోట్లను లెక్కించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకున్నామని , అకౌంటింగ్ లోపాలను, డబుల్ కౌంట్స్‑ను తొలగిస్తూ రద్దయిన నోట్లను లెక్కిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది.

లెక్కింపు పూర్తయ్యే వరకు బ్యాంకింగ్ సిస్టమ్‑లోకి తిరిగి వచ్చిన పెద్ద నోట్లెన్ని అన్న దానిపై ఎలాంటి సంకేతాలు ఇవ్వం’ అని రిజ‌ర్వ్ బ్యాంకు తేల్చిచెప్పింది. డిసెంబర్‌ 10న వెలువడిన అధికారిక ప్రకటనలో ఆర్‌బీఐ, కరెన్సీ చెస్టులకు చేరిన మొత్తం రూ.12.44 లక్షల కోట్లని తెలిసింది. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నోట్లను బ్యాంకుల్లో జమచేసుకోవడానికి డిసెంబర్30 వరకు గడువిచ్చారు. నోట్ల రద్దుతో తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‑లోకి రూ.14.5 లక్షల కోట్ల నుంచి రూ.15 లక్షల కోట్లు రద్దయిన నోట్లు వచ్చుంటాయని పలు రిపోర్టులు వెల్లడించాయి.  అయితే ఎంత మేరకు పెద్ద నోట్లు తిరిగి నోట్లు తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‑లోకి వచ్చాయో పూర్తిగా లెక్కించిన తరువాతే  ఆర్ బీ ఐ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.