రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

106

గంజాయిని తరలించడానికి  స్మగ్లర్లు పలు విధాలుగా అక్రమంగా రవాణ చేస్తున్నారు. తాజాగా క్యాబేజీ లోడులో భారీగా గంజాయిని పెట్టి  అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా విజయవాడలో పోలీసులు కాపు కాసి బెంజిసర్కిల్ వద్ద పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 1.30 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తు్న్నారు.