మరో ఆరు స్పెషల్ ట్రైన్స్

58

సంక్రాంతి పండుగ  కోసం స్వగ్రామలకు వెళ్లేందుకు ఇప్పటికే రైల్వేశాఖ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఇటు రైళ్లలోనూ, బస్సులలో ను టిక్కెట్లు వారం ముందే బుక్కయ్యాయి. దీంతో కొంతమందికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మరో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాకినాడ – సికింద్రాబాద్, కాకినాడ – నాందేడ్ మధ్య నాలుగు, మధురై – విజయవాడ మధ్య రెండు రైళ్లను వేశామని, ఇవి ఈ నెల 13 నుంచి 16 మధ్య తిరుగుతాయని, ఈ రైళ్లలో రిజర్వేషన్లను నేటి నుంచి ప్రారంభించామని ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని కోరింది.