స్కూల్ బస్సులో మంటలు

63

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె శివారులో స్కూల్ బస్సుకు ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. విద్యార్థుల‌ను తీసుకెళుతున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన బ‌స్సు డ్రైవర్ చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో విద్యార్థులకు ప్రాణాపాయం త‌ప్పింది. స‌ద‌రు డ్రైవ‌ర్‌ విద్యార్థులను సురక్షితంగా కిందకు దించడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు