శంషాబాద్ లో బుల్లెట్ల కలకలం

75

శంషాబాద్ ఎయిర్ పోర్టులో  బుల్లెట్లు అల‌జ‌డి రేపాయి. త‌నిఖీలు నిర్వ‌హిస్తోన్న అధికారులు ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద బుల్లెట్లు ఉన్న‌ట్లు గుర్తించారు.  రాజ్‌కుమార్ అనే ప్ర‌యాణికుడి నుంచి 32 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాజ్‌కుమార్ అక్క‌డి నుంచి ఢిల్లీకి వెళుతున్నట్లు తెలిపారు. అత‌డు హైదరాబాద్‌కు చెందినవాడని పేర్కొన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆరా తీస్తున్నారు.