షార్ట్‌సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధం

141

షార్ట్‌సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమై లక్షల్లో ఆస్తినష్టం జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది… టేకులపల్లి మండలం కొత్తతండాలో షార్ట్‌సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో ఇళ్లలో ఉన్న 50 క్వింటాళ్ల పత్తి, 30 క్వింటాళ్ల ధాన్యంతో పాటు ఇతర వస్తువులు కూడా పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు వారు తెలిపారు.