సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన

75

విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన  రంగాదాంపల్లిలో 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంలో మరిన్ని విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. రూ. 12 వేల కోట్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎందేనన్నారు.