సిద్దూ కాంగ్రెస్ గూటికి…

55

బీజేపీ మాజీ ఎంపీ…క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ…కాంగ్రెస్ లో చేరటంపై క్లారిటీ వచ్చింది.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఆ పార్టీలో చేరబోతున్నారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు సిద్దూ. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 2004 నుంచి 2014 వరకు రెండు సార్లు అదే నియెజకవర్గం నుంచి బీజేపీ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె గతేడాది నవంబర్ లోనే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో సిద్ధూ జాయినింగ్ ను నవజ్యోత్ కౌర్ కన్ఫామ్ చేశారు. పార్టీలో సిద్ధూ రోల్ పై…రాహుల్ గాంధీ, అమరేందర్ సింగ్ నిర్ణయం తీసుకుంటారన్నారు.