సింగ‌రేణి ఓపెన్‌కాస్ట్ గ‌నిలో అగ్నిప్ర‌మాదం

109

సింగ‌రేణి ఓపెన్‌కాస్ట్ గ‌నిలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా టేకుల‌ప‌ల్లి మండ‌లం కోయిగూడ‌లోని ఓపెన్‌కాస్ట్ గ‌నిలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌టనా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ ఘటనలో కోటి రూపాయ‌ల ఆస్తిన‌ష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు.