సంక్రాంతికి స్పెష‌ల్ బ‌స్సులు

60

సంక్రాంతి పండుగ‌కు సొంతూళ్ల‌కు వెళ్లే వారి కోసం తెలంగాణ రోడ్డు ర‌వాణా సంస్థ ప్ర‌త్యేక బస్సులు న‌డుప‌నుంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే వారి కోసం స్పెష‌ల్ స‌ర్వీసులు ఆప‌రేట్ చేస్తున్న‌ట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా 750 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్టు ఎంజీబీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగరాజు తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ దృష్ట్యా ఏపీకి వెళ్లే బస్సులను ఎల్‌బీ నగర్‌ నుంచి నడుపుతామని చెప్పారు. 300 కిలో మీటర్ల దూరం పైన 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపారు.