సర్వేలన్నీ మోడీకి అనుకూలం..

55

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.. దీంతో, కేంద్ర బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయాలని… ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తాయిలాలను బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్ర బడ్జెట్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదని… బడ్జెట్ అంటే కేవలం రాయితీలు, పన్నుల తగ్గింపులు ఇవే కాదని చెప్పారు. బడ్జెట్ లేకపోతే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ను విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదని అన్నారు. సర్వేల్లో ప్రధాని మోడీకి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో… తమతమ అజెండాలను పదేపదే విపక్షాలు మార్చుకుంటున్నాయని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీలో జరుగుతున్నదంతా ఫ్యామిలీ డ్రామానే అని… అఖిలేష్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.