తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్

267

తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు  జీవో నెంబ‌రు.123 ద్వారా భూములు తీసుకోవ‌ద్ద‌ని స‌ర్కారుకి స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రాజెక్టులకు, ఎత్తి పోతలపథకానికి 2013 భూసేకరణ చట్టం కింద కాకుండా జీఓ 123 ద్వారా భూమిని తీసుకుంటున్నారని మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఆ భూములపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు, పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ లపై  ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి  చట్టాన్ని కాదని, కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం భూములను తీసుకుంటోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. గత ఏడాది నవంబర్‌ 24న మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

జీవో 123 పేరుతో అధికారులు తమ భూములను బలవంతంగా లాక్కుంటూ, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని రైతులు హైకోర్టుకు నివేదించారు. బలవంతంగా భూములు తీసుకోవడం లేదని ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల నుంచి వారికి మెరుగైన పరిహారం చెల్లించిన తరువాతనే భూములు తీసుకుంటున్నామని కోర్టుకు నివేదించింది. ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి భూములను కొనుగోలు చేసే అధికారం రాజ్యాంగం తమకు కల్పించిందని వివరించింది. . అయితే ఈ వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది.  అయితే జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని హైకోర్టు గురువారం మధ‍్యంతర ఉత‍్తర్వులు జారీచేసింది. 2013 భూసేక‌ర‌ణ ప‌ద్ధ‌తిలో భూమి సేక‌రిస్తే ఎటువంటి అభ్యంత‌రాలు ఉండ‌బోవ‌ని తెలిపింది.