క్రికెటర్ వసీం అక్రమ్ కు అరెస్టు వారెంట్

74

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వ‌సీం అక్ర‌మ్‌కు స్థానిక సెష‌న్స్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.  గ‌త ఏడాది జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క్రికెట‌ర్ వ‌సీం స్థానిక రిటైర్డ్ మేజ‌ర్ అమినుర్ రెహ్మాన్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ  కేసులో వ‌సీం కోర్టు విచార‌ణ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు హాజ‌రుకాలేదు. దాదాపు 31 సార్లు కోర్టులో ఆ కేసు కోర్టు విచార‌ణ‌కు వ‌చ్చింది. క్రికెట‌ర్ అక్రం గైర్హాజ‌రు కావ‌డంతో ఆ కేసులో కోర్టు అత‌నికి  వారెంట్‌ను జారీ చేసింది. గ‌త ఏడాది జ‌రిగిన ఘ‌ట‌న‌లో అక్రం మెర్సిడీజ్ కారును మాజీ మేజ‌ర్ ఢీకొట్టాడు. ఇద్ద‌రి మ‌ధ్య చెల‌రేగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆ మేజ‌ర్ త‌న రివ్వాల‌ర్ తీసి కూడా బెదిరించాడు. ఈ కేసులో జ‌న‌వ‌రి 17న క‌చ్చితంగా అక్రం విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశించింది. ప్ర‌స్తుతం బౌలింగ్ కోచ్ అక్రం తమ జాతీయ జట్టుతో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నాడు.