కాశ్మీర్ లో ఆగని ఆందోళనలు

84

జమ్మూకాశ్మీర్ లో ఉప ఎన్నికల సందర్భంగా చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం అనంత్ నాగ్ లో ఆందోళనకారులు రెండు పాఠశాలలకు నిప్పు పెట్టారు. ఆదివారం శ్రీనగర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల రోజున షోపియాన్‌ ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటుచేసే రెండు పాఠశాలలకు ఆందోళనకారులు నిప్పటించి నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.