మహిళలు పిల్లలు కనే యంత్రాలు కారు..

57

ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివరణ ఇచ్చారు.  మీరట్ లో  తాను జనాభా నియంత్రణ గురించే మాట్లాడానని.. కాని ఏ వర్గం పేరును ప్రస్తావించలేదని తెలిపారు. మహిళలు పిల్లలు కనే యంత్రాలు కాదని .. జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  అయినా తాను మాట్లాడింది ఎన్నికల ర్యాలీలో కాదని…  సాధువులు ఏర్పాటు చేసిన సభలో అని చెప్పారు. కాగా, దేశ జనాభా పెరగడానికి ఓ వర్గమే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.