ప్రొడ్యూసర్ గా మారనున్న రఘుకుంచె

338

ఒకప్పుడు రఘు కుంచె మంచి సింగర్. కాస్తంత ఫేం అల్లా వచ్చిందో లేదో అక్కడితో సరిపెట్టుకున్నాడా…? లేదు మ్యూజిక్ కంపోజర్ గా మారిపోయాడు. అప్పుడప్పుడు యాంకర్ గా, ఆర్టిస్ట్ గా మ్యాగ్జిమం చేస్తికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రఘు కుంచె, ఈ మాత్రం కూడా తనకు సరిపోదు అనుకున్నాడేమో ఈ సారి ఏకంగా ప్రొడ్యూసర్ పగ్గాలు పట్టేసుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఘాజి లో మంచి క్యారెక్టర్ ప్లే చేసిన సత్యదేవ్ సరసన పూజా జవేరి క‌థానాయిక‌గా ప్రదీప్ మల్లాది డైరెక్షన్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు రఘు కుంచె. ఈ విషయం తానే స్వయంగా ట్వీట్ చేసి మరీ అనౌన్స్ చేశాడు. సినిమా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చిన రఘు కుంచె సినిమా గురించి ఇంకా తక్కిన డీటేల్స్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా మారిన రఘు కుంచె ప్రొడక్షన్ హౌజ్ నుండి ఏదైనా థ్రిల్లర్ తెరకెక్కనుందా..? లేకపోతే ఏదైనా మెస్మరైజింగ్ లవ్ స్టోరీ తెరకెక్కనుందా అనే విషయం సినిమా లాంచ్ అయితే కానీ తెలీదు.