‘కిట్టు’ వ‌స్తున్నాడు జాగ్రత్త..!

202

ఎప్పుడో లాస్ట్ ఇయర్ ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలో కనిపించిన రాజ్ తరుణ్ మధ్యలో క్యామియో లా అప్పుడప్పుడు ఓ చిన్న ఎంట్రీ ఇచ్చి సరిపుచ్చుకున్నాడే కానీ, మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ క‌థానాయ‌కుడిలా సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ కనబడనే లేదు. దాదాపు పది నెలల గ్యాప్ తరవాత ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అంటూ మార్చి 3 న రెడీ ఫర్ రిలీజ్ అంటున్నాడు రాజ్ తరుణ్. వంశీకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లో అనూ ఇమ్మాన్యువేల్ క‌థానాయిక‌గా నటించింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది. అల్టిమేట్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రాజ్ తరుణ్. అర్బాజ్ ఖాన్ విలన్ గా నటించిన ఈ సినిమా, ఇప్పటికే కావాల్సినంత పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంది.