టచ్ చేసి చూడు లేటెస్ట్ షెడ్యూల్

239

మాస్ మహారాజ్ ‘టచ్ చేసి చూడు’ లేటెస్ట్ షెడ్యూల్ బిగిన్ అయింది.  ప్రస్తుతం పాండిచ్చేరి లో షూటింగ్ ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ ఓ సాంగ్ ని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించేసింది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్ ఏ మాత్రం డిలేస్ కి ఛాన్స్ లేకుండా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రేస్ గుర్రం’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన విక్రమ్ సిరికొండ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. రవితేజ మార్క్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ప్రీతమ్ చక్రవర్తి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.