వెంకటాపురం రిలీజ్ డేట్

186

హ్యాపీడేస్ ఫేం రాహుల్ హీరోగా నటించిన సస్పెన్స్  థ్రిల్లర్ వెంకటాపురం రిలీజ్ డేట్ ఫిక్సయింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రేలర్, ‘వెంకటాపురం’ సినిమాని కంటెంట్ ఉన్న సినిమాల క్యాటగిరీ లోకి తోసేసింది. వేణు మాదికంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహిమా మక్వాన్ హీరోయిన్ గా నటిస్తుంది. అచ్చు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. చిన్న సినిమానే అయినా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న సినిమా యూనిట్ ఈ సినిమాని ఉగాది సందర్భంగా మార్చి 29 న రిలీజ్ చేస్తున్నారు.