గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్య‌త‌

240

ప్ర‌భుత్వం గ్రామీణాభివృద్దికి అధిక ప్రాధాన్య‌తనిస్తోంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సోమవారం ఆయ‌న జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల్లో తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్ కార్డును అనుసంధానించాలని తెలిపారు. గొర్రెల పంపిణీకి సంబంధించి సీఎం కలెక్టర్ల అభిప్రాయం తీసుకున్నారు. గొర్రెల పెంపకం సహాకార సంఘాల్లో  సభ్యత్వాలు చేయించాలన్నారు. అవసరమైతే సంఘాలు లేని ప్రాంతాల్లో కొత్త సంఘాలు ఏర్పాటుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండవని, ఎవరైనా ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.